ఆయనో ప్రజా ప్రతినిధి.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉంటారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన మూలాలను మర్చిపోలేదు. అధికార దర్పానికి దూరంగా ఆ ఎమ్మెల్యే.. వ్యవసాయ పొలంలో పనిచేస్తూ రైతు కూలీతో కలిసిపోయారు. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. నకిరేకల్(ఎస్సీ) నియోజక వర్గం నుంచి 2014ఎన్నికల్లో బీఆరెస్ నుంచి గెలిచిన వీరేశం 2018ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఎమ్మెల్యే వీరేశం ప్రజా కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకల ఉంటారు.
వానాకాలం సీజన్ ముగిసి.. యాసంగి సీజన్ కోసం రైతులు ఇప్పటినుంచే వరి నార్లు పోసుకుంటున్నారు. తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా అవతారం ఎత్తాడు. నకిరేకల్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలను చల్లి..పొలం పనుల్లో పాల్గొన్నారు. ప్రతి వానాకాలం, యాసంగి సీజన్లలో ఎమ్మెల్యే వేముల వీరేశం.. కూలీలతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటాడు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లడం, మహిళా కూలీలకు నాట్లు వేసేందుకు అవసరమైన నారును అందిస్తుంటారు. ఎమ్మెల్యే తమతో కలిసి పనిచేయడం చూసిన కూలీలు ఆయన వ్యవహారశైలిని అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..