రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ దేశంలో టాప్‌లో నిలిచింది. కేవలం 0.3 శాతమే రేషన్‌బియ్యం తెలంగాణలో పక్కదారి పడుతున్నట్టు సర్వే తేల్చింది. అరుణాచల్, నాగాలాండ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రేషన్‌బియ్యం ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతోంది.
Ration Rice
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడడంలో తెలంగాణ దేశంలో టాప్‌లో నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు పౌర సరఫరాల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. కేవలం 0.3 శాతం మాత్రమే రేషన్‌బియ్యం రాష్ట్రంలో అనర్హులకు చేరినట్టు జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో తేలింది. గుజరాత్‌లో 30 శాతం రేషన్‌బియ్యం పక్కదారి పట్టగా తెలంగాణలో మాత్రం కేవలం 0.3 శాతం మాత్రమే వృధా అయ్యింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రెండు కోట్ల 80 లక్షల మందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా 49 లక్షల మంది విద్యార్ధులకు, అంగన్‌వాడీలు , హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
దీంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రేషన్ దుకాణాల్లో పేద కుటుంబాలకు వివిధ రకాల ఆహార ధాన్యాలను అందించబోతున్నారు. రేషన్ బియ్యం దుర్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్ , నాగాలాండ్ అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్ తరువాత స్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో రేషన్‌బియ్యం అక్రమ రవాణాను అరికడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీస్థాయిలో రేషన్‌బియ్యం పక్కదారి పట్టినట్టు ICRIER సర్వే తేల్చింది. నిరంతర నిఘా , పర్యవేక్షణ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికడుతున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…