హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన కులగణన సంప్రదింపుల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గాన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రూప్1 మెయిన్స్ నిర్వహించిందని, మొత్తం 563 పోస్టులకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల్లో నుంచి 1:50 నిష్పత్తిలో 31,383 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని అన్నారు.
అయితే ఈ ఎంపికలో అగ్రకులాలకు చెందిన అభ్యర్థులకు మేలు జరిగిందని కొందరు విమర్శలు చేశారని అన్నారు. కానీ, వాస్తవంలో గణాంకాలు వేరుగా ఉన్నాయన్నారు. ఆ పౌర సమాజం ముందు ఉంచుతున్నానని చెబుతూ ఎంపికైన అభ్యర్థుల్లో ఓసీలు 3,076 (9.8%), ఈడబ్ల్యూఎస్ 2,774 (8.8%), ఓబీసీలు 17,921 (57.11%), ఎస్సీలు 4,828 (15.38%), ఎస్టీలు 2,783 (8.8%) చొప్పున ఉన్నారని తెలిపారు. బీసీలు 27 శాతం రిజర్వేషన్లను పొందడమేకాకుండా.. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల్లో అత్యధికంగా 57.11 శాతం మంది బీసీలే ఉన్నారని చెప్పారు. ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం.. చివరి తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. నవంబరు 26వ తేదీ వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఇక రూ.100 నుంచి రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 27 వరకు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను దాదాపు 9.50 లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ కోర్సులకు రూ.520, ఒకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ ఉన్నందున రూ.750 చెల్లించాలి. సెకండియర్ ఆర్ట్స్ కోర్సులకు రూ.520, సైన్స్, ఒకేషనల్‌కు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి