యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. మూడు రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఎంతో హృద్యంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు. కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎమోషనల్ గా చూపించారు.దీంతో ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే థియేటర్ లో తండేల్ సినిమా చూస్తూ ఓ మహిళ అభిమాని ఎమోషనల్ అయ్యింది. సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవిలకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
థియేటర్ లో ఏడుస్తోన్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో..
ఎన్ని ట్యాంక్ నీలు ఉన్నాయ్ అమ్మ..🥹🥹
Proud of you Anna #NagaChaitanya 🧎 థియేటర్స్ తీసుకొచ్చి మరి యేడిపిస్తునవ్ Actor @chay_akkineni ❤️🤌#Thandel #ThandelJaathara #ThandelRaju pic.twitter.com/8jzlo8j5J6
— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 9, 2025
.
కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై విచారణకు ఆదేశించారు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు. అంతకు ముందు దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్మాత బన్నీవాసు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
తండేల్ సినిమా పైరసీపై విచారణ.
APSRTC Chairman Konakalla Narayana Rao has ordered an enquiry into the alleged screening of a pirated mentation of the movie #Thandel connected an @apsrtc bus.
ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు… https://t.co/hsM8wDRah5
— BSN Malleswara Rao (@BSNMalleswarRao) February 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.