ఐసీసీ బుధవారం (నవంబర్ 21) విడుదల చేసిన కొత్త ఐసీసీ టీ20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న పాండ్యా.. ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో పాండ్యా మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న హార్దిక్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్‌ను వెనక్కునెట్టేశాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ రెండింటితోనూ మెరిశాడు. ముఖ్యంగా ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20లో క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ 39 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతోపాటు బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో పాటు ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన హార్దిక్ కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో హార్దిక్ ఇప్పుడు టీ20లో ప్రపంచ నంబర్ వన్ ఆల్ రౌండర్ గా నిలిచాడు.
ఇక ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ -5లోకి దూసుకొచ్చాడు. ఆఫ్రికాతో సిరీస్ కు ముందు 72వ ర్యాంక్ లో ఉన్న తిలక్ ఇప్పుడు టాప్ 3వ స్థానానికి దూసుకురావడం విశేషం. సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్రికాపై 107 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్, ఆ తర్వాత జోహన్నెస్‌బర్గ్‌లో కూడా అజేయంగా 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 20 సిక్స్‌లు, 21 ఫోర్లతో 140 సగటుతో 280 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి
TILAK VARMA’S T20I RANKING:
19th November – 72.
20th November – 3.
THE RISE OF TILAK IN T20 CRICKET…!!!#tilakverma #BCCI #T20ranking #INDvSA #INDvsSA pic.twitter.com/cZnQPGDtkM
— Raviraj Yadav (@Raviraj02922665) November 20, 2024
కాగా ఒకప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు తిలక్ వర్మ కంటే దిగువకు పడిపోయాడు. ప్రస్తుతం సూర్య 4వ స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో సూర్య పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫలితంగా T20 ర్యాంకింగ్స్‌లో సూర్య వెనకబడ్డాడు.
HARDIK PANDYA – THE NEW NO.1 RANKED T20I ALL ROUNDER🔥#HardikPandya #BCCI #T20ranking pic.twitter.com/7gcHPIvEhR
— Raviraj Yadav (@Raviraj02922665) November 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..