ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న చిన్నారి గ్లోబల్ స్టార్. హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ ఏకంగా రూ.40 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటుంది. జీవితంలో ఎన్నో వివాదాలు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కోంది. కానీ ఇప్పుడు ప్రపంచం మెచ్చే కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? హీరోయిన్ ప్రియాంక చోప్రా. బీహార్ లో జన్మించిన ప్రియాంక గ్రాడ్యుయేషన్ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. 2002లో విడుదలైన తమిజన్ సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. విజయ్ దళపతి నటించిన ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యింది.
మొదట తమిళంలో సినిమా చేసిన ప్రియాంక ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఒకానొక సమయంలో ఇండస్ట్రీని శాసించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ అమ్మడు రామ్ చరణ్ సరసన నటించింది.
ఇవి కూడా చదవండి
ఇక ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది ప్రియాంక. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక హాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఒక్క ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంది. ఫోర్బ్స్, డీఎన్ఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికే చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.