బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ కొన్నాళ్లుగా అతడిని విజయం వరించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అతడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి. దీంతో అతడి డిమాండ్ నెమ్మదిగా తగ్గుతోంది.ఈ క్రమంలోనే అతడు తన అపార్ట్‌మెంట్ అమ్మేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ముంబైలో తనకున్న కోట్లాది రూపాయల అపార్ట్‌మెంట్‌ను అమ్మేశాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. అతడే బీటౌన్ స్టార్ అక్షయ్ కుమార్. అయితే ఇప్పుడు తన గురించి వస్తున్న వార్తలపై అక్షయ్ రియాక్ట్ ఇంకా రియాక్ట్ కాలేదు.
అక్షయ్ కుమార్ కు ముంబైలోని వర్లిలోని 360 వెస్ట్ టవర్ లో ఒక అపార్ట్ మెంట్ ఉంది. 39వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ఇప్పుడు అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటిని దాదాపు రూ.80 కోట్లకు అమ్మేశారని సమాచారం. దీంతో అక్షయ్ కుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. జనవరి 31న అక్షయ్ తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. 6830 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో 4 కార్ల పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఈ ఆస్తిని పల్లవి జైన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. 4.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఇది ముంబైలో చాలా వాణిజ్య ప్రాంతం. కాబట్టి ఈ అపార్ట్‌మెంట్ చాలా ఎక్కువ ధరకు అమ్ముడైంది.
ఇవి కూడా చదవండి
కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాలే అయ్యాయి. కానీ ఇప్పటికీ ఈ హీరోకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల అతడు నటించిన స్కై ఫోర్స్’ సినిమా ఈ ఏడాది జనవరి 24న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ సినిమాకి ప్రతికూల సమీక్షలు రావడంతో ప్రేక్షకులు దానిపై ఆసక్తి చూపలేదు. దీని తర్వాత, అక్షయ్ కుమార్ తన అపార్ట్‌మెంట్‌ను అమ్మేశారని వార్తలు వినిపించాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన