పై ఫొటోలో దివంగత దాసరి నారాయణ రావు, మెగాస్టార్ చిరంజీవిలతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? పక్క ఫొటో చూస్తే కచ్చితంగా స్టార్ హీరో మెటీరియల్ అనిపిస్తుంది కదా? అలా అనుకుంటూనే అతననూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నటుడిగా వందలాది చిత్రాల్లో మెరిశాడు. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ అన్ని సైడ్ క్యారెక్టర్లే. అందుకే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అదే సమయంలో జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటించినా రానీ గుర్తింపు ఒక్క జబర్దస్త్ కామెడీ షోతో సొంతం చేసుకున్నాడు. మరి పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు గడ్డం నవీన్. ఇక పై ఫొటోల విషయానికి వస్తే టీనేజ్ లో దిగినవి. ఇక రెండో ఫొటో విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమా ఈవెంట్ లోది. ఈ వేడుకలో దర్శక రత్న దాసరి నారాయణ రావు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాడు గడ్డం నవీన్.
నవీన్ 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో నటించాడు. అప్పట్లో ఫుల్ జుట్టుతో.. సూపర్ హెయిర్ స్టైల్‌తో నిజంగానే స్టార్ హీరోలా ఉన్నాడు నవీన్. కానీ సినిమాల్లో ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ రోల్స్ రావడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ కమెడియన్. రామసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, బ్యాడ్ బాయ్స్ సినిమాల్లో నటించాడు నవీన్. ఎక్కువగా విలన్ గ్యాంగ్స్ లోనే కనిపించాడు. అయితే జబర్ధస్త్ తర్వాతే నవీన్ కు మంచి గుర్తింపు లభించింది.
ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ లో ఓ కీలక పాత్ర పోషించాడు గడ్డం నవీన్. అలాగే పలు పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నాడీ కమెడియన్.
‘సినిమాల్లో భిన్నమైన పాత్రలు చెయ్యాలని కోరిక ఉంది. కమెడియన్ గా చేస్తున్నాను. సెంటిమెంట్ పాత్రలు, విలన్ పాత్రలు చెయ్యాలన్న ఆశ కూడా ఉంది. దర్శకనిర్మాతలు ఎప్పటికైనా నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాను’ అని అంటున్నాడు నవీన్.
భార్యతో జబర్దస్త్ గడ్డం నవీన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.