చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా రాణించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కడ కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కమర్షియల్ సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా అంది త్రిష.
ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
తమిళ్ లో త్రిష వరుసగా సినిమాలను లైనప్ చేసింది. ఇప్పటికే అజిత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తుంది. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. త్రిష వరుసగా 22 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా త్రిష ఓ స్టార్ హీరో పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరో నాకు ఎప్పుడూ ప్రత్యేకమే అని త్రిష చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
త్రిష తన కెరీర్ లో ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసింది. అలాగే ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. తాజాగా త్రిష ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తనకు దళపతి విజయ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది అని తెలిపింది. ఆయన ఎప్పటికీ తనకు ప్రత్యేకమే అని చెప్పుకొచ్చింది త్రిష . అలాగే విజయ్ చాలా లవ్వబుల్ పర్సన్, అతనితో పని చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ దళపతిని ఆకాశానికెత్తేసింది త్రిష. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇటీవలే లియో సినిమాలోనూ నటించారు. అలాగే విజయ్ నటించిన గోట్ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేశారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి