స్టార్ హీరోయిన్ త్రిష ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. ఆ రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మళయాలంలో ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవలే అజిత్ తో కలిసి త్రిష నటించిన విదాముయార్చి (తెలుగులో పట్టుదల) భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కూడా ఉంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది త్రిష. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అయితే త్రిష తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ అయిన కొన్ని పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎక్కువగా సినిమా విషయాలే కనిపించే త్రిష ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీ గురించి చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వీటిని గమనించిన త్రిష వెంటనే అలర్ట్ అయ్యింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని గ్రహించింది. దానిని వెంటనే ఇన్ స్టాగ్రమ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.
‘నా ట్విట్టర్ హ్యాక్ అయింది. సరిదిద్దే వరకు నా నుంచి ఎలాంటి పోస్ట్ లు రావు.. ధన్యవాదాలు’ అని తన ఫాలోవర్లకు తెలియజేసింది. కాగా త్రిష సోషల్ మీడియాలు హ్యాక్ కావడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో`పెటా` కార్యకర్తగా ఉన్న త్రిషకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ఖాతాలను కొందరు హ్యాక్ చేసారు. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. దీంతో ఈ విషయాన్ని గ్రహించిన త్రిష తాను క్రిప్టో గురించి ఎలాంటి పోస్టులు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
Actress @trishtrashers Twitter relationship Hacked! 😯#Trisha | #TrishaKrishnan pic.twitter.com/AhzPjvi3ri
— CINEWOOD (@CINEWOOD01) February 11, 2025
త్రిష చేతిలో ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలు ఉన్నాయి.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.