కేరక్టర్లను రాసుకోవడంలోనే కాదు, వాటికి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకోవడంలోనూ త్రివిక్రమ్ జడ్జిమెంట్‌కి తిరుగులేదని అంటారు. రీజినల్ సినిమాలు చేసేటప్పుడే అంత కేర్ తీసుకునే కెప్టెన్.. ఇప్పుడు ఐకాన్‌స్టార్‌తో తెరకెక్కించబోయే ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకు ఇంకెంత ప్లానింగ్‌తో ఉంటారో.. మీరే ఊహించుకోండి అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఇప్పుడు విషయమేంటి? అంటారా.. మాట్లాడుకుందాం పదండి...
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 12, 2025 | 8:16 PM
కేరక్టర్లను రాసుకోవడంలోనే కాదు, వాటికి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకోవడంలోనూ త్రివిక్రమ్ జడ్జిమెంట్‌కి తిరుగులేదని అంటారు. రీజినల్ సినిమాలు చేసేటప్పుడే అంత కేర్ తీసుకునే కెప్టెన్.. ఇప్పుడు ఐకాన్‌స్టార్‌తో తెరకెక్కించబోయే ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకు ఇంకెంత ప్లానింగ్‌తో ఉంటారో.. మీరే ఊహించుకోండి అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఇప్పుడు విషయమేంటి? అంటారా.. మాట్లాడుకుందాం పదండి...
1 / 5
ఐకాన్‌స్టార్ మనకి అల్లు అర్జునే కానీ, మాలీవుడ్‌కి మాత్రం మల్లు అర్జున్.. మలబారు తీరాన ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది మరి. పీలింగ్స్ పాటలో సాకీని మలయాళంలోనే పెట్టడానికి రీజన్ కూడా అదేనని చెప్పేశారు సిల్వర్‌స్క్రీన్ పుష్పరాజ్.
2 / 5
కేరళ స్టేట్‌లో ఐకాన్‌స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి త్రివిక్రమ్‌కి చాలా బాగా తెలుసు. అందుకే ఆల్రెడీ అలవైకుంఠపురములో సినిమాలో మలయాళం స్టార్ జయరామ్‌కి ప్రామినెంట్ రోల్ ఇచ్చారు త్రివిక్రమ్.
3 / 5
ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఉగాది పర్వదినాన ప్రారంభం కానున్న బన్నీ - త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పుడు మమ్ముట్టిని అప్రోచ్ అయ్యారన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్.
4 / 5
పర్ఫెక్ట్ రోల్‌తో అప్రోచ్ కావాలేగానీ, టాలీవుడ్‌కి ఎప్పుడూ నో చెప్పలేదు మమ్ముట్టి. అందులోనూ త్రివిక్రమ్ డైరక్షన్‌లో బన్నీతో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటారా? వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఒక్కసారి యూనిట్ అఫీషియల్‌గా చెప్పేస్తే వినాలని ఉందంటోంది అల్లు ఆర్మీ.
5 / 5