నెలకు రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. అయితే కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిధిని ఉత్పన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తిధికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఈ రోజున ఏకాదశి తిధి ఉద్భవించిందని నమ్మకం. కనుక ఈ తిధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది నవంబరు 26న ఉత్పన్న ఏకాదశి వ్రతం పాటించనున్నారు. ఈ రోజు ఉపవాసం చేయడం, దానధర్మాలు చేయడం ద్వారా విష్ణువుతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అని నమ్మకం. ఈ ఉత్పన ఏకాదశి రోజున చేసే పూజల వలన ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోడని విశ్వాసం.
ఉత్పన్న ఏకాదశికి పూజ సమాగ్రి
ఉత్పన్న ఏకాదశిని పూజించడానికి శ్రీ విష్ణుమూర్తి చిత్రం లేదా విగ్రహం, పూలు, కొబ్బరికాయ, తమలపాకులు, పండ్లు, స్వీట్లు, లవంగాలు, అక్షతం, తులసి దళం, గంధం, ధూపం, దీపం, నెయ్యి, పంచామృతాన్ని తీసుకోండి.
ఉత్పన్న ఏకాదశి పూజ విధి
ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆరాధించడానికి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తర్వాత ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేయండి. తర్వాత ఒక పీటంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్టించండి. తరువాత విష్ణువు మూర్తికి పసుపు పూలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, అక్షతం, చందనం, తులసి దళాలు సమర్పించండి. ఆ తరువాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో తయారు చేసిన పంచామృతాన్ని శ్రీ మహా విష్ణువుకు సమర్పించండి. విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. అందుకే ఖచ్చితంగా పంచామృతంలో తులసి దళాలను కలపండి. ఆ తర్వాత ఉత్పన్న ఏకాదశి శీఘ్ర కథను పఠించండి. చివర్లో హారతి ఇచ్చి విష్ణువుకి ఇష్టమైన ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించి.. తిరిగి అందరికీ పంచాలి.
ఇవి కూడా చదవండి
ఈ మంత్రాలను జపించండి
విష్ణు మూల మంత్రం
ఓం నమో నారాయణాయ ॥
భగవతే వాసుదేవాయ మంత్రం
ఓం నమో: భగవతే వాసుదేవాయ.
విష్ణు గాయత్రీ మంత్రం
ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి.
తన్నో విష్ణుః ప్రచోదయాత్.
శ్రీ విష్ణు మంత్రం
మంగళం విష్ణువు, మంగళం గరుంధ్వాజ్.
మంగళం పుండ్రీ కక్ష, మంగళయ్ తనో హరి.
ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత
ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వ్యక్తి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు నశిస్తాయి.. మోక్షం లభిస్తుంది. ఈ రోజున చేసే దానధర్మాలు చాలా పవిత్రమైనవి అని నమ్ముతారు. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున చేసే పూజలు బహుళ ఫలితాలను ఇస్తుంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.