ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం (Valentine's Day 2025) జరుపుకుంటున్న సందర్భంగా ప్రేమ వ్యవహారాలు ఎవరికి అచ్చివస్తాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రేమ వ్యవహారాలకు శుక్రుడు కారకుడు. ప్రస్తుతం శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, పైగా గురువుతో పరివర్తన చెంది ఉండడం వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. మరి మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందేమో చెక్ చేసుకోండి.
Love Astrology 2025
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Feb 08, 2025 | 7:31 PM
Love Astrology 2025: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day 2025) జరుపుకుంటున్న సందర్భంగా ప్రేమ వ్యవహారాలు ఎవరికి అచ్చివస్తాయన్న దానిపై అందరి దృష్టీ పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రేమ వ్యవహారాలకు శుక్రుడు కారకుడు. ప్రస్తుతం శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, పైగా గురువుతో పరివర్తన చెంది ఉండడం వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. సాధారణంగా వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభం, మీన రాశుల వారు ప్రేమ వ్యవహారాల్లో పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శుభ గ్రహాల అనుకూలతలు మరో రెండు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ రాశుల వారితో ప్రేమలో పడడం వల్ల ప్రేమ జీవితం, ఆ తర్వాత పెళ్లి జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా వెలిగిపోయే అవకాశముంటుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, వృషభ రాశిలో గురువు సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమ బంధానికే కాక, కుటుంబ బంధానికి కూడా అత్యంత విలువనిచ్చే వృషభ రాశివారితో ప్రేమలో మ పడడం, ప్రేమింపజేసుకోవడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ప్రతి విషయంలోనూ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించే ఈ రాశివారు తన ప్రేమ భాగస్వామిని మెప్పించడానికి చేయని ప్రయత్నం ఉండదు.
- కర్కాటకం: ఈ రాశికి శుక్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, లాభ స్థానంలో గురువుతో పరివర్తన చెందడం వల్ల అతి తేలికగా ప్రేమలో పడడం, అందులో విజయం సాధించడం జరుగుతుంది. సాధా రణంగా కుటుంబ బంధాలకు, నీతి నిజాయతీలకు విలువనిచ్చే ఈ రాశివారికి గురు, శుక్రులి ద్దరూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీసే అవ కాశం ఉంది. సహోద్యోగితో గానీ, పరిచయం ఉన్న వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పరి వర్తన చెందడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడడం జరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే సూచనలున్నాయి. వీరు ప్రేమలో విజయం కోసం ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించే అవకాశం ఉంటుంది. వీరితో ప్రేమలో పడే వారికి జీవితంలో ఇక ఎటువంటి సమస్యలూ ఉండకపోవచ్చు. జీవితం సాఫీగా సాగిపోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. సాధారణంగా బంధువుతో గానీ, ఇరుగు పొరుగు వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవ కాశం ఉంటుంది. కొద్దిపాటి శ్రమతో వీరు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రేమ బంధంతో పాటు కుటుంబ బంధానికి కట్టుబడి ఉండే ఈ రాశివారితో ప్రేమలో పడినవారు అదృష్టవంతు లవుతారని జ్యోతిషశాస్త్రం కూడా చెబుతోంది. వీరి ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- కుంభం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, కుటుంబ స్థానాధిపతి గురు వుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇతరులు ఈ రాశివారి ప్రేమ కోసం ప్రయత్నించడం కూడా జరుగుతుంది. సాధారణంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరించే ఈ రాశివారు ప్రేమలో పడిన మరుక్షణం నుంచి ప్రేమ భాగస్వామికి పూర్తిగా అంకితమయ్యే అవకాశం ఉంటుంది. పరిచయస్థులతో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది.
- మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. ఈ రాశివారినే ఇతరులు ప్రేమించే అవకాశం ఉంది. సహోద్యోగులతో ప్రేమలో పడే సూచ నలు న్నాయి. ఈ రాశివారు సరదాగా, సంతోషంగా జీవితం గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. సాధా ర ణంగా ఈ రాశివారితో ప్రేమ జీవితమైనా, పెళ్లి జీవితమైనా నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపో తుంది. సాధారణంగా వీరు ఏ బంధానికైనా అత్యంత ప్రాధాన్యం, విలువ ఇవ్వడం జరుగుతుంది.