విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతనికి పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమాను అందించలేకపోతున్నాడు రౌడీ బాయ్. భారీ అంచనాలతో విడుదలైన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాలు కూడా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. అయితే ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో కింగ్ డమ్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు విజయ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ను కాసేపటి క్రితమే చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం కింగడమ్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే టీజర్ రిలీజైన నిమిషాల వ్యవధిలోనే హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించింది. కింగ్ డమ్ సినిమా టీజర్ తనకెంతో నచ్చిందంటూ ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇతను ఒకే తరహా కథలతో ప్రతిసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తాడు. ప్రతిసారీ ఏదో ఒక అద్భుతంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాడు. విజయ్ నిన్ను చూసి నేను చాలా గర్వ పడుతున్నా’ అంటూ విషెస్ చెప్పింది రష్మిక. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రష్మిక, విజయ్ దేవర కొండ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. అప్పటి నుంచే ఈ జంట ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ‘కింగ్‌డమ్’ సినిమా టీజర్‌ను తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో రణ్‌బీర్ కపూర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది మే30వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
This is “KINGDOM”
Questions. Mistakes. Bloodshed. Destiny.
Telugu — https://t.co/IYwiss0nOP Tamil — https://t.co/EP0i0VtsDh Hindi — https://t.co/lBTjr1lxi2
May 30, 2025. In theaters WW#Kingdom #VD12 pic.twitter.com/1Gg7riOGzF
— Vijay Deverakonda (@TheDeverakonda) February 12, 2025
కింగ్ డమ్ టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి