రోడ్డుపై ప్రయాణించే సమయంలో అంబులెన్స్ వస్తే దారివ్వడం కనీస బాధ్యత. అయితే ఓ కారు డ్రైవర్ మాత్రం రెండు నిమిషాలకు పైగా అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు. వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.
Kerala: Car operator fined
ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవత్వం. చావు బతుకుల మధ్య ఆసుపత్రికి వెళుతున్న అంబులెన్స్‌కు దారివ్వడం మనిషి బాధ్యత. అలా చేస్తే.. అంబులెన్స్ సమయానికి ఆస్పత్రికి వెళ్లి ఓ ప్రాణం నిలబడుతుంది. అందుకే సామాన్య జనం మాత్రమే కాదు.. సెలబ్రిటీలు.. ప్రొటోకాల్ ఉన్న పొలిటిషన్స్ సైతం.. అంబులెన్స్ వెళ్తుంటే.. తమ వాహనాలను సైడ్‌కి తీస్తుంటారు. అయితే కేరళలో కారులో వెళ్లున్న వ్యక్తి మాత్రం అంబులెన్స్‌కు కావాలనే సైడ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఘటనా తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే….
రోడ్డుపై కారు వెళ్తుండగా… వెనుక అంబులెన్స్ వస్తోంది. అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ సైరన్‌తో పాటు హారన్ మోగిస్తున్నాడు. అయినా ముందున్న కారు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. చాలా సేపటి వరకూ కారు వెనకాలే అంబులెన్స్ వెళ్లాల్సి వచ్చింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆ అంబులెన్స్ సిబ్బంది ఫోన్ రికార్డు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారు రిజిస్ట్రేషన్ ప్లేట్ నుంచి డ్రైవర్‌ను సియాజ్‌గా పోలీసులు గుర్తించగలిగారు. కారు యజమానికి కేరళ పోలీసులు రూ.2.5 లక్షల జరిమానా విధించడమే కాక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిసింది. లైసెన్స్ రద్దుకు సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. పోలీసులు చర్య పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మానవత్వం ప్రదర్శించని డ్రైవరు పట్ల కామెంట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194E ప్రకారం.. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 లేదా జరిమానా, జైలు శిక్ష.. కొన్ని పరిస్థితుల్లో రెండూ విధించవచ్చు.
వీడియో దిగువన చూడండి…