పొలంలో విత్తనాలు చల్లినప్పటినుంచి ఆ పంట సురక్షితంగా ఇంటికి చేరేంత వరకూ రైతుకు కంటి మీద కునుకు ఉండదు. ఓవైపు చీడపీడలు, మరోవైపు పక్షులు, జంతువుల బారినుంచి కాపాడుకోడానికి నానా అవస్థలు పడతారు. చీడపీడల నివారణకి పురుగు మందులు కొడతారు. మరి జంతువులు, పక్షుల నుంచి కాపాడుకోవాలంటే పొలంలో కాపలా కాయాల్సిందే. అయితే ఈ అవస్థ లేకుండా ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు.
ముఖ్యంగా మొక్కజొన్న, పుచ్చకాయ, కాయగూరలు వంటివి సాగు చేస్తున్న సమయంలో పక్షులతో పాటు పందులు కూడా పంటలపై దాడి చేస్తున్నాయి. ఈక్రమంలోనే పంటలను కాపాడుకోవాలంటే కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎకరం పొలంలో పంటను కాపాడుకోవాలంటే కూలీ ఖర్చులు చాలా ఎక్కువ అవడంతో కాస్త వినూత్నంగా ఆలోచించాడు. సాంకేతికతను జోడించి పొలంలో పశుపక్ష్యాదులను తరిమికొట్టేందుకు దానికి నాలుగు వైపులా మైకులు అమర్చాడు. అందులో పక్షులను తోలుతున్న శబ్ధం రికార్డ్ చేశాడు. దాన్నే పదే పదే వినిపించేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో పొలంలో నిత్యం మనుషులు సంచరిస్తున్న భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే పక్షులతో పాటు పందులు వంటివి కూడా పంట పొలంలోకి రాకుండా ఉంటాయన్నాడు. ఇందుకు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. మైక్ ను ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేసి అది పని చేయడానికి పవర్ బ్యాంక్ ను జత చేశాడు. పవర్ బ్యాంక్ కోసం మరో ఏడు వందల రూపాయలు ఖర్చవుతున్నట్లు రైతు ఎలీసా చెప్పాడు. ఎకరానికి రెండు మూడు మైకులు పెట్టినట్టు తెలిపాడు. ఖర్చు తక్కువుగా ఉండటంతో పాటు పంటలను కాపాడుకునేందుకు ఈ మార్గం సౌలభ్యంగా ఉన్నట్లు చెప్పాడు. ఈ రైతు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.