కాన్పూర్‌లోని బితూర్‌లో ఒక మహిళ తన భర్తను హత్య చేసి.. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లుగా క్రియేట్ చేయడానికి యత్నించి అడ్డంగా చిక్కింది. బితూర్‌లోని ధ్రువ్ నగర్‌లో రంగుల రాట్నాలు నిర్వహించే అబిద్, జనవరి 18న చనిపోయినట్లు గుర్తించారు. శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరిచే డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల అబిద్ చనిపోయాడని అతని భార్య షబానా తన సోదరుడు సలీమ్‌కు సమాచారం అందించింది. అయితే అబిద్ మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులను గమనించిన సలీం అనుమానం వ్యక్తం చేశాడు. ప్రశ్నించగా షబానా తింగరి సమాధానాలు చెప్పింది. దీంతో డౌట్ వచ్చి సలీం తన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఔరయ్యలోని దిబియాపూర్‌కు చెందిన అబిద్, రెండు దశాబ్దాలుగా భార్యాపిల్లలతో కలిసి బితూర్‌లోని ధ్రువ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు, జాతరలలో పనిచేస్తున్నాడు. అతని అనుమానాస్పద మృతి తర్వాత, పోలీసులు అతని జేబులో ఎనిమిది శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు గుర్తించారు. అయితే పోస్టుమార్టంలో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. విచారణలో షబానా తన ప్రేమికుడు రెహాన్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. షబానాను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. తమకు అడ్డు వస్తున్నాడనే భర్తను ఖతం చేసినట్లు తెలిపింది. వీరికి మరో వ్యక్తి వికాస్‌కు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ ముగ్గురూ అబిద్‌పై దాడి చేసి గొంతు పిసికి చంపారు.
అయితే శృంగార సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకుని చనిపోయాడని నమ్మించేందుకు షబానా అబిద్ జేబులో ఆ ట్యాబ్లెట్లు పెట్టింది ఓవర్‌డోస్ అయి చనిపోయినట్లుగా నమ్మించాలని స్కెచ్ వేసింది. కానీ సీన్ రివర్సయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..