ఈ పేరే ఓ బ్రాండ్. చూడడానికి ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తాడో… అంతే అగ్రెసివ్‌గా ఆడతాడు. తనదైన ప్లేయింగ్ స్టైల్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నాడు. ఇక మనోడు వాడే బ్రాండ్స్‌తో పాటు ప్రమోట్ చేసే బ్రాండ్స్ కూడా చాలా హైలెవల్‌లో ఉంటాయి. రెస్టారెంట్ బిజినెస్ కూడా మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ..రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికీ ఓ డ్రీమ్ హౌజ్ ఉంటుంది. తమ కలలకు, అభిరుచులకు సరిపోయే విధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా తమ డ్రీమ్ హోమ్‌ని దగ్గరుండి మరీ కట్టించుకున్నారు. ముంబయిలోని ఈ భారీ బంగ్లాలోకి ఈ మధ్యే వెళ్లి వచ్చారు దంపతులు. ఈ ఇంటి నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ బంగ్లా…ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ ఇంట్లోకి త్వరలోనే గృహప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటి నుంచి మరోసారి ఈ విలాసవంతమైన బంగ్లా గురించి చర్చ జరుగుతోంది.
ముంబయిలో కోహ్లీ, అనుష్క శర్మ కట్టించుకున్న ఈ బంగ్లా అలిబౌగ్ అనే ఏరియాలో ఉంది. ఇక్కడ చాలా మంది సెలెబ్రిటీల ఇళ్లున్నాయి. ఇవి వాళ్లకి హాలిడే హోమ్స్. ఎప్పుడూ బిజీగా ఉండే సెలెబ్రిటీలు..మధ్యలో ఎప్పుడైనా కాస్త హాలిడే తీసుకున్నప్పుడు..ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారు. మరి రిలాక్స్ అవ్వాలంటే..అందుకు తగ్గట్టుగా అందులో అన్ని సౌకర్యాలు ఉండాలిగా. అందుకే… అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న స్టీఫెన్ ఆంటోని ఆర్కిటెక్ట్స్‌తో ఇంటిని డిజైన్ చేయించు కున్నాడు విరాట్ కోహ్లీ. మొత్తం 2022లో 19 కోట్ల రూపాయలు పెట్టి 8 ఎకరాల స్థలం కొన్నాడు. మొత్తం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో నాలుగు బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఇటాలియన్ మార్బుల్స్, ప్రిస్టీన్ స్టోన్స్, టర్కిష్ లైమ్‌స్టోన్స్…ఇలా ప్రతీదీ రిచ్‌గా కనిపించేలా డిజైన్ చేశారు. వీటితో పాటు టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమింగ్ పూల్ ఉంది. నాలుగు బాత్‌రూమ్‌లు, ఓ భారీ కిచెన్, విశాలమైన గార్డెన్‌తో పాటు స్టాఫ్ కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ కట్టేశారు. ఇంటీరియర్ అంతా చకచకా మెరిసిపోయే విధంగా ఖరీదైన మార్బుల్స్ వాడారు.
ఈ ఇంటి స్థలం కోసమే దాదాపు 19 కోట్లు పెట్టిన విరాట్ కోహ్లీ..ఇల్లు కట్టుకోవడం కోసం సుమారుగా 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అంచనా. అంటే…మొత్తంగా..ఈ ఇంటి విలువ 34 కోట్లు. అత్యాధునిక ఆర్కిటెక్చర్‌కి అద్దం పట్టేలా ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు. టాప్ ఇంటీరియర్ డిజైనర్ సుసానీ ఖాన్ ఈ ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది కోహ్లీ. ఇంటీరియర్‌లో అందంతో పాటు టెక్నాలజీనీ జోడించారు. అంతా ఆటోమేషన్‌తో నడిచేలా డిజైన్ చేశారు. గ్యాస్ లీక్ డిటెక్టర్స్, అడ్వాన్స్‌డ్ ఎయిర్ అంట్ వాటర్ ఫిల్టర్‌ని అమర్చారు. ఇదంతా సింపుల్‌గా ఓ మొబైల్ యాప్‌తో మెయింటేన్ చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ కూడా గతంలో ఓ సారి ఈ హోమ్ ఆటోమేషన్ గురించి మాట్లాడాడు. ఇది తనకెంతో ఇష్టమైన ఫీచర్ అని చెప్పాడు. గతంలో ఇందుకు సంబంధించి ఓ హోమ్ టూర్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అప్పట్లో అది సోష్ మీడియాలో సెన్సేషన్ అయింది. అయితే…ఈ అలిబౌగ్‌లోని బంగ్లాతో పాటు గుడ్‌గావ్‌లోనూ కోహ్లీ ఓ ఇల్లు కొన్నాడు. ఆ ఇంటి ధర 80 కోట్లు. అలిబౌగ్‌లోని బంగ్లాలో తన ఇద్దరు పిల్లలతో కలిసి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయనున్నారు. ఇప్పటి నుంచి ఇదే వాళ్ల హాలీడే హోమ్ కానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ పలుకే “బంగారం” పెరిగినా..తగ్గినా.. అంతా ఆయన చేతుల్లోనే
Sunita Williams: సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చూశారా ??
నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు