గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు విశ్వక్ సేన్. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు. ఇప్పుడు లైలాగా మరోసారి మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ప్రమోషన్లలో భాగంగా ఈనెల 17న సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. తాజాగా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
ఇది కూడా చదవండి : క్రికెటర్‌తో ఎఫైర్.. ఫ్రెండ్ భర్తతో ఆ యవ్వారం.. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఎవరో తెలుసా.?
ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అదరగొట్టాడు. కామెడీ సీన్స్ లో విశ్వక్ ఆకట్టుకున్నాడు. అలాగే విశ్వక్ సేన్ యాక్షన్ సీన్స్ తోపాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయాడు. ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో విశ్వక్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ కు వాయిస్ ఇచ్చింది ఓ స్టార్ సింగర్.
ఇది కూడా చదవండి :ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
అవును లైలా సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ కు ఓ సింగర్ వాయిస్ ఇచ్చింది. విశ్వక్ అమ్మాయి వాయిస్ తో డబ్బింగ్ చెప్తే సెట్ అవ్వదని ఓ సింగర్ తో డబ్బింగ్ చెప్పించారట. ఆ సింగర్ ఎవరంటే.. తెలుగులో ఎన్నో సాంగ్స్ పాడి అలరించిన శ్రావణ భార్గవి. లైలా సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ కు శ్రావణభార్గవి డబ్బింగ్ చెప్పిందట. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి