అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న లావా మంచుపై జారుతున్నట్టుగా దిగువకు పారుతూ వచ్చింది. నిజానికి లావా ఉష్ణోగ్రత 1,500 సెంటీగ్రేడ్ డిగ్రీల నుంచి 2 వేల డిగ్రీల వరకు అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆ వేడికి రాళ్లు, ఇనుము వంటివే కరిగిపోతాయి. అలాంటిది ఈ ప్రాంతంలో వాతావరణం శీతలంగా ఉండటంతో… అగ్ని పర్వతం చుట్టుపక్కల అంతా మంచుతో అలాగే నిండిపోయి ఉంది. దానిపైనే లావా పారుతూ, అది తగిలిన చోట మంచును కరిగిస్తూ ముందుకు సాగింది.
ఫిబ్రవరిలో అగ్ని పర్వతం వద్ద మంచుపై లావా ప్రవాహాన్ని ఓ వ్యక్తి వీడియో తీశారు. దానిని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిన్స్‌తో రూపొందించినదని… మంచుపై లావా పారడం ఏమిటన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ అది ఒరిజినల్ వీడియోనేనని తేల్చారు. మరోవైపు ప్రకృతి ఎంతో చిత్రమైనదని, ఇలాంటివి చిన్న ఉదాహరణలేననే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోకు నాలుగున్నర లక్షలకుపైగా లైకులు వచ్చాయి కూడా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.