Watch: 12 అంతస్తుల హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి..పలువురికి గాయాలు..

11 hours ago 1

టర్కీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 66 మంది సజీవదహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

12 అంతస్తుల హోటల్‌లోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయని బోలు గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

#BREAKING A occurrence astatine a skis edifice edifice successful Bolu, Turkiye.

At slightest 234 guests astatine #GrandKartal_Hotel successful Kartalkaya successful Bolu, Turkiye wherever the occurrence broke out, politician says. At slightest 10 dead, 32 injured. #Bolu #Kartalkaya #Turkiye #Firepic.twitter.com/rPlughyOWP

— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) January 21, 2025

హోటల్ జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.  కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 234 మంది అతిథులు ఉన్నట్టుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article