95 మందితో ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది…ఈ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. సోమవారం రష్యా నుంచి బయలుదేరిన సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం తుర్కియే లోని అంటాల్యా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో మంటలు విమానమంతా వ్యాపించాయి. వెంటనే స్పందించిన అధికారులు 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానం పూర్తిగా దగ్ధమైంది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రష్యా విమానం దక్షిణ టర్కీలోని అంటాల్య విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్ అయిన తర్వాత ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
Fire Panic connected Russian Plane astatine Antalya Airport! 🔥✈️ A Sukhoi Superjet 100 benignant rider level belonging to the Russian hose Azimuth encountered a superior mishap during its landing astatine Antalya Airport. It was reported that the level leaked substance arsenic a effect of its near engine… pic.twitter.com/s86v16jHpC
— AirportIST (@AirportIST) November 24, 2024
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:34 గంటలకు విమానం ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అత్యవసర కాల్ చేసాడు. ఎయిర్‌పోర్ట్ రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్ సిబ్బంది త్వరగా మంటలను ఆర్పివేశారని ప్రకటనలో తెలిపారు. సమీపంలోని మిలిటరీ రన్‌వే నుండి బయలుదేరే సమయంలో విమానాశ్రయానికి రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..