సోషల్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్ నిజంగా హృదయాన్ని కదిలించేది. రీల్స్ పై ఉన్న మక్కువ హద్దులు దాటుతోంది. చనిపోయిన సొంత సోదరుడిని కూడా వదల్లేదు ఓ చెల్లులు. అతని మృతదేహంపై కూడా రీల్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది ఆ చెల్లెలు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోదరుడి మృతదేహం వెనుక పడి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అతని భార్య బిగ్గరగా ఏడుస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం మనిషి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నయో ఆందోళన కలిగిస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ మహిళపై దుర్భాషలాడుతున్నారు.
ఈ మహిళ తన సోదరుడి మరణంపై రీల్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి ఎంత దూరం వెళ్లగలరో నిరూపించింది. ఆ వీడియో చూసి జనాలకు కోపం రావడం సహజం.. ఎందుకంటే దుఃఖించే సమయాన్ని ఇలా వాడుకోవడం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో గది లోపల మృతదేహాన్ని ఉంచారు. అక్కడే కూర్చున్న అతని భార్య గట్టిగా ఏడుస్తోంది. మృతుడి సోదరి ఆమె పక్కనే కూర్చుని ఉంది. గదిలో మరో మహిళ కూడా ఉంది. ఇంతలో, రీల్ షూట్ చేస్తూ, మృతుడి సోదరి స్థానిక భాషలో, భాబీ, ఏడవకండి. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఒక వ్యక్తికి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటూ ఓదార్చుతూ కనిపింది.
వీడియో చూడండి:
జనవరి 16న @noble_mobile_shopee Insta హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ని చూసిన నెటిజన్లు చాలామంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొంతమంది వినియోగదారులు దీనిని మానసిక దివాళా తీశారని, సదరు మహిళపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే ప్రక్రియలో చాలా మంది సిగ్గులేని పరిమితులను దాటుతున్నారని ఒక నెటిజన్ రాశారు. మరొకరు మానవత్వం ఎక్కడికి వెళుతోంది? మరో వినియోగదారు వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మహిళ లైక్, సబ్‌స్క్రయిబ్ చెప్పడం మర్చిపోయిందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..