దీపావళి రోజు రాత్రి లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపి ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఒక ప్రైవేట్ లేడీ డాక్టర్‌కు తగిన శాస్తి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన ఓ లేడి డాక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. అక్టోబర్ 31న దీపావళి వేడుకల్లో బాగంగా డాక్టర్ ఆంచల్ లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో థార్ జీపు దగ్గర నిలబడిన ఓ మహిళ పిస్టల్‌లోంచి గాలిలోకి ఐదు బుల్లెట్లను ఒక్కొక్కటిగా పేల్చుతోంది. వైరల్ వీడియోలో లైసెన్స్ పొందిన పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన మహిళ అలయన్స్ కాలనీ రుద్రాపూర్ నివాసి ఆంచల్ ధింగ్రా అని కొత్వాల్ గుర్తించారు.
ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
వీడియో ఆధారంగా డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమె గన్ లైసెన్స్ రద్దుకు సన్నాహాలు చేపట్టారు. ఆయుధాల చట్టం ప్రకారం ఏ లైసెన్స్ హోల్డర్ కూడా అనవసరంగా కాల్పులు జరపకూడదని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..