అమ్మవద్దకు పరుగెత్తుకెళ్తున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషాధ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికుల కథనం మేరకు.. ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక. సోమవారం లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. మధ్యాహ్నం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది.
వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు చెప్పారు. ఎప్పుడూ చలాకీగా ఉండే కుమార్తె ఉన్నట్లుండి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవల గుండెపోటు మహమ్మారిలా మారింది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ పొట్టన పెట్టుకుంటోంది. చిన్నారి మృతితో స్థానికంగా విషాదం అలముకుంది. స్థానికులు సైతం చిన్నారిని చూసి కంటతడి పెట్టుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.