Winter Care: చలికాలపు చర్మ సమస్యలకు బైబై చెప్పండి..! ఈ రహస్యాలు తెలుసుకోండి..!

2 hours ago 1

చలికాలం వచ్చిందంటే చర్మం పొడిగా మారడం సహజం. చల్లటి గాలులు, తక్కువ తేమ, ఎండ లేకపోవడం వల్ల చర్మం సులభంగా నీరసం పొందుతుంది. ఈ పరిస్థితుల్లో చర్మానికి సరైన తగిన సంరక్షణ అవసరం. అందుకే చలికాలం కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో చర్మ సమస్యలు ?

చలికాలంలో చల్లటి గాలులు చర్మంపై ఉన్న సహజ నూనెను తొలగిస్తాయి. తక్కువ తేమ శాతం వల్ల చర్మం పొడిగా మారి, చిట్లిపోతుంది. ఈ పరిస్థితులు చర్మం గ్లో తగ్గించడమే కాకుండా.. ముడతలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీనివల్ల చర్మం నిస్తేజంగా కనబడుతుంది.

ఫేస్‌వాష్

చలికాలంలో తక్కువ హార్ష్ కెమికల్స్ ఉండే ఫేస్‌వాష్ వాడడం మంచిది. వేసవిలో మనం ఎక్కువ నురగ కలిగిన క్లెన్సర్లను ఉపయోగిస్తాం, అయితే చలికాలంలో ఇవి చర్మాన్ని మరింత పొడిగా చేస్తాయి. కాబట్టి సున్నితమైన, SLS-ఫ్రీ క్లెన్సర్ వాడితే చర్మం మృదువుగా ఉంటుంది.

టోనర్ వాడకం

చలికాలంలో టోనర్ చర్మం హైడ్రేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. టోనర్‌లో హ్యూమెక్టెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. టోనర్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే, తేమ ఎక్కువ సమయం పాటు నిల్వ ఉంటుంది. ఇది చర్మం పొడిగా మారకుండా ఉండేలా చేస్తుంది.

మాయిశ్చరైజర్

తేమను అందించడంలో మాయిశ్చరైజర్ కీలక పాత్ర వహిస్తుంది. చలికాలంలో హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ వాడటం చాలా ముఖ్యమైంది. లైట్ క్రీములకంటే కాస్తా కాఠిన్యంగా ఉండే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం మంచిది. ఉదయం, రాత్రి రెండు సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

సన్‌స్క్రీన్

చలికాలంలో ఎండ తక్కువగా కనిపించినా, యూవీ కిరణాలు చర్మానికి హానికరమే. రోజూ SPF 30 లేదా అంతకన్నా ఎక్కువ గల సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం వల్ల చర్మం పిగ్మెంటేషన్, నల్లటి మచ్చల నుంచి రక్షించబడుతుంది. సన్‌స్క్రీన్‌తో చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

నీరు తాగడం మర్చిపోకండి

చలికాలంలో మనకు దాహం తక్కువగా వేస్తుంది. కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే చర్మం పొడిబారి మృతకణాలతో నిండి ఉంటుంది. కనీసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగడం వల్ల తగిన తేమను అందిస్తుంది.

చర్మం కోసం కొన్ని చిట్కాలు

1. చల్లటి లేదా వేడి నీటితో కాకుండా గోరువెచ్చటి నీటితో ముఖం కడగడం చర్మానికి మంచిది.

2. వారానికి ఒకసారి చర్మంపై మృతకణాలను తొలగించేందుకు తేలికపాటి స్క్రబ్ వాడండి.

3. చలికాలంలో పెదాలు పొడిగా ఉండటానికి ట్యుట్రస్ స్టిక్ లేదా లిప్ బామ్ ఉపయోగించండి.

4. తేలికపాటి ఆహారం తీసుకోవడం చర్మానికి మంచిది.

5. చల్లగాలులకు చర్మాన్ని కాపాడటానికి షాల్స్ లేదా మఫ్‌లర్ ధరించడం అవసరం.

6. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో డైట్ పాత్ర. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినడం చలికాలంలో చర్మానికి చాలా ప్రయోజనకరం. విటమిన్ A, C, E వంటి పోషకాలు చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడతాయి. ఆకుకూరలు, సిట్రస్ పండ్లు ఎక్కువగా తినడం ద్వారా చర్మానికి కావాల్సిన పోషణ లభిస్తుంది.

ఈ చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో చర్మానికి తగినంత సంరక్షణ అందుతుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలం కారణంగా చర్మం పొడిబారడం, ముడతలు పడటం వంటి సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article