రాకింగ్ స్టార్ యశ్ కు ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా యశ్ చాలా మంది ఫెవరెట్ హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. కేజీఎఫ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు యశ్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Updated on: Feb 06, 2025 | 9:31 PM
రాకింగ్ స్టార్ యశ్ కు ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా యశ్ చాలా మంది ఫెవరెట్ హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. కేజీఎఫ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు యశ్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
1 / 5
యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న 'టాక్సిక్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యష్ నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు . ఈ సినిమాలో ప్రధానంగా విదేశీ తారలు నటిస్తున్నారు. బెంగళూరులో ఇప్పటికే చిత్రీకరణ జరుగుతోంది.
2 / 5
షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో నటిస్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఓ విలాసవంతమైన సెట్‌లో జరుగుతోంది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్ 'టాక్సిక్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార జాయిన్ అయ్యిందని తెలుస్తుంది.
3 / 5
టాక్సిక్ సినిమాలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి నటించనున్నారు. ఇక ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ 'టాక్సిక్' టీమ్ కుమరింత ఉత్సాహాన్నిచ్చింది. కాగా ఈ ఏడాది యష్ పుట్టినరోజు సందర్భంగా 'టాక్సిక్' సినిమా టీజర్ విడుదలైంది. అందులో యష్ రగ్డ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
4 / 5
ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్‌లు తెలుసుకోవడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. 'కెవిఎన్ ప్రొడక్షన్స్' ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ నటిస్తున్న సినిమా 'టాక్సిక్' కాబట్టి, 'టాక్సిక్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
5 / 5