వీరిలో తన చిన్న కొడుకు దేశ్ రాజ్ వద్ద ఉంటున్నాడు దైనీ సింగ్. అనారోగ్య కారణాల చేత అతడు ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసి గ్రామం బయట నివసిస్తున్న అతని పెద్ద కొడుకు కిషన్ తమ్ముడి ఇంటికి చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్‌రాజ్ తన అన్నతో చెప్పాడు.
Fathers Last Rites
తండ్రి అంత్యక్రియల కోసం కుమారులు ఘర్షణ పడ్డారు. మృతదేహాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఇద్దరు కుమారుల మధ్య తండ్రి అంత్యక్రియల విషయంలో వివాదం నెలకొంది. ఇద్దరు సోదరులు తమ తండ్రిని దహనం చేయాలనుకున్నారు. వారిద్దలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. చివరకు ఈ వివాదం ఎంతవరకు వెళ్లిదంటే..అన్నాదమ్ములిద్దరు తండ్రి శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకుని అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని ముక్కలుగా నరికివేస్తున్నారనే వార్త గ్రామంలో దవానంలా వ్యాపించింది.
మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 84ఏళ్ల దైనీ సింగ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారు. వీరిలో తన చిన్న కొడుకు దేశ్ రాజ్ వద్ద ఉంటున్నాడు దైనీ సింగ్. అనారోగ్య కారణాల చేత అతడు ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసి గ్రామం బయట నివసిస్తున్న అతని పెద్ద కొడుకు కిషన్ తమ్ముడి ఇంటికి చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్‌రాజ్ తన అన్నతో చెప్పాడు.
ఈ విషయంలో తమ్ముడితో గొడవకు దిగిన కిషన్ తండ్రి శరీరాన్ని సగం కోసి తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. అది విన్న గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కిషన్‌కు సర్ది చెప్పడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దేశ్‌రాజ్ తన తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి