అటు కాలుష్యం.. ఇటు పొగమంచుతో ఢిల్లీ బాటలో పయనిస్తోంది హైదరాబాద్. కాలుష్యంతో భాగ్యనగరంలో గాలి నాణ్యత తగ్గిపోతోంది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200మార్క్‌ని దాటేసింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు, కాలుష్యంతో హైదరాబాద్‌పై స్మాగ్ పడగ విప్పింది. కాలుష్యానికి పొగమంచు తోడైతే స్మాగ్ ఏర్పడుతుందని.. స్మాగ్‌లో నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి హానికర రసాయనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే పదేళ్లలో గ్యాస్ ఛాంబర్‌లా హైదరాబాద్ మారుతుందని అంటున్నారు.
ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చలి వల్ల పెరుగుతున్న పొగమంచుకి ఇది తోడై, నగరంలో స్మాగ్ ఏర్పడుతోంది. దీనివల్ల వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ ఇనెఫెక్షన్స్ ఫాస్ట్‌గా వ్యాపిస్తాయని, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఓయూ ప్రొఫెసర్ శ్రీ నగేష్. అస్తమా పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఎక్కడెక్కడ ఎంతెంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో చూద్దాం.
ఇవి కూడా చదవండి
కనిష్ఠ ఉష్ణోగ్రతలు..
హైదరాబాద్ – 15.7 డిగ్రీలు రామగుండం – 14.5 డిగ్రీలు ఆదిలాబాద్ – 12.7 డిగ్రీలు హన్మకొండ – 14.5 డిగ్రీలు మెదక్ – 12.0 డిగ్రీలు
తెలంగాణవ్యాప్తంగా ఈ సీజన్‌లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఐదారు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు. ఈ వాతావరణం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని, రాత్రి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలంటున్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కంపల్సరీగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. అటు చలి, ఇటు కాలుష్యం…ఇప్పుడు ఈ రెండు కలిసి హైదరాబాద్‌ని భయపెడుతున్నాయి. నగరవాసులు పారాహుషార్ అంటున్నారు అధికారులు.
ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..