దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Goat
Updated on: Feb 06, 2025 | 9:48 PM
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన చివరి మూవీ ది గోట్. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరీ, స్నేహ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో మరోసారి విజయ్ యాక్టింగ్ తో అదరగొట్టినప్పటికీ, కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. తండ్రి కొడుకులుగా విజయ్ ఆకట్టుకున్నాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఇందులో విజయ్ కూతురిగా నటించిన అమ్మాయి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఫోటోస్ సెర్చ్ చేస్తూ తన బ్యాగ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఈ మూవీలో విజయ్ కూతురిగా కనిపించిన అమ్మాయి పేరు అభ్యుక్త మణికందన్. ఈ చిన్నది తన నటనతో ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి : క్రికెటర్‌తో ఎఫైర్.. ఫ్రెండ్ భర్తతో ఆ యవ్వారం.. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఎవరో తెలుసా.?
ఈ చిన్నదాని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కోలీవుడ్ లో అంతో ఇంతో ఫేమస్. సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అభ్యుక్త. ఆమె తండ్రి సినీరంగంలో చాలా ఫేమస్ సినిమాటోగ్రాఫర్. సౌత్ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ కూతురు. అపరిచితుడు, రావన్, ఏ జవానీ హై దీవాని, ఓం శాంతి ఓం, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఇలాంటి ఎన్నో హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు మణికందన్. అలాగే తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు కూడా ఆయన కెమెరామెన్ గా పనిచేశారు. ఇక తండ్రి బాటలోనే కూతురు అభ్యుక్త కూడా సినీరంగంలోకి అడుగుపెడుతుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
దళపతి విజయ్ నటించిన గోట్ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లా చదువుతున్న అభ్యుక్త.. ఇప్పుడిప్పుడే ఫ్యాషన్ ప్రపంచంలోకి మోడల్ గా మారింది. ఇప్పటికే పలు బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొంది. అంతేకాకుండా ఆమె భారత నాట్యం డ్యాన్సర్. స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్స్ చేస్తుంది. ఇక అభ్యుక్త తల్లి ప్రియా మణికందన్, గోట్ డైరెక్టర్ స్నేహితులు కావడంతో ఆమెకు ఈ సినిమాలో రోల్ ఆఫర్ చేయగా.. అభ్యుక్త తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ది గోట్ చిత్రంలో విజయ్ కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి