ఎంతో సంతోషంగా గడపడం కోసం ట్రిప్ కు వెళ్ళిన ఫ్యామిలీ ఆనందం ఒక చిన్న సంఘటన నాశనం చేసింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన తర్వాత జనం ఇలా జరుగుతుందా అని కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. పిల్లలు సంతోషంగా ఉంటేనే ఇల్లు కళకళాడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పిల్లలకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా సరే ఇంట్లోని తల్లిదండ్రుల సహా ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతారు. మరి పిల్లల అనారోగ్యానికి ఏదైనా ప్రయాణంలో లేదా పర్యటనలో గురైతే మరింత ఆందోళనకు గురవుతారు. తాజాగా వైరల్ అవుతున్న వార్తలో తల్లిదండ్రులు తమ పిల్లలతో సెలవులకు ఓ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ట్రిప్ సజావుగా సాగడం కోసం ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన సంఘటనతో యాత్ర కన్నీరు పెట్టించింది.
హోటల్‌లో భోజనం చేస్తే వచ్చే ఫలితం ఇదేనా?
డైలీ స్టార్ కథనం ప్రకారం బ్రిటన్‌కు చెందిన ఒక జంట తమ రెండేళ్ల కుమార్తె క్లో క్రూక్ తో కలిసి ఈజిప్ట్ మిల్ప్‌లో విహారయాత్రకు వెళ్లారు. అక్కడ హోటల్ రిసార్ట్ లో ఆహారం తిన్న తర్వాత బాలిక ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లింది. ఇప్పుడు చిన్నారి ప్రాణాల పోరాడుతుంది. చావు బతుకుల మధ్య ఊగిసలాడే పరిస్థితి నెలకొంది. అతని కుటుంబం మొత్తం హుర్ఘదా ఫైవ్ స్టార్ రిసార్ట్ జాజ్ ఆక్వావివాలో బస చేశారు. అక్కడ ఆహారం తిన్న బాలికకు విరేచనాలు, అలసట, కడుపునొప్పి వచ్చింది. క్రమంగా ఆ బాలిక పరిస్థితి విషమించింది. బాలిక ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లగా బాలిక కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. వెంటనే బాలికకు డయాలసిస్ చేశారు.
ఇవి కూడా చదవండి
బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించింది నివేదిక ప్రకారం క్లోయ్‌కి ప్రాణాలు తీసే ఈ-కోలి బ్యాక్టీరియా బారిన పడినట్లు తెలిసింది. ఈ బ్యాక్టిరియా కారణంగా బాలిక ఆరోగ్యం దిగజారింది. మీడియా నివేదికల ప్రకారం ఈ బ్యాక్టీరియా చిన్నారి శరీరంలో హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌కు కారణమైంది. ఇది నేరుగా మానవ మెదడును దెబ్బతీస్తుంది.
తల్లిదండ్రులు తమ కుమార్తె పరిస్థితి చూసి షాక్ తిన్నారు. చివరకు తమ పిల్లలను తిరిగి తమ దేశానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాలిక చేతులు, మెడలో రక్తం గడ్డకట్టడం వల్ల నాలుగు రోజులు కోమాలో ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఆ చిన్నారి చాలా మనసులో భయం ఉండిపోయింది. అందుకనే రాత్రి వేళ భయంతో ఉల్కిపడి నిద్రలేస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..