దక్షిణాఫ్రికాలో మూసివేసిన బంగారం గనిలోకి కొంతమంది దిగారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నాలుగు వేల మంది అందులోకి దిగారు. కానీ, వారు అందులోనే చిక్కుకుపోయారు. మిగిలిన బంగారం దొరుకుతుందేమోనన్న ఆశే వారిని ఇంత సాహసానికి పోయేలా చేసింది. మైన్‌లో చిక్కుకుపోయిన వారంతా మైనర్లేనని తెలుస్తోంది. వారిని బయటకు తీసుకురావాల్సిన ప్రభుత్వం ససేమిరా అంటోంది.
గనిలో చిక్కుకున్న వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గని ద్వారాలు మూసేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం, నిత్యావసరాలను అందించకూడదంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ వారు ఎలాగైనా బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ‘క్లోజ్‌ది హోల్’ ఆపరేషన్‌ను చేపట్టింది. అందుకు ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని మోహరించింది. గని లోపల దాదాపు 4 వేల మంది మైనర్లు ఉన్నారు. అందులో పలువురు ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయినట్లు తెలుస్తోంది. బయటకి వచ్చే వారిని అరెస్టు చేసేందుకు అధిక సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్యంలో నాలుగు వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా? అంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
Published on: Nov 19, 2024 05:17 PM