సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ ఈ రంగుల లోకంలో ఎదగాలని తామంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది హీరోయిన్స్ కలలు కంటుంటారు. కాగా కొంతమందికి అవకాశాలు వస్తే మరికొంతమంది అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అవకాశాల కోసం ఎదురుచూసే వారిని లోబరుచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే కాదు హీరోయిన్స్ గా మారిన తర్వాత కూడా కొంతమంది లైంగిక వేధింపులకు గురైన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ పై తమ గొంతు విప్పారు. తాజగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలిపింది. తెలుగు, తమిళ్ భాషల్లో తనకు ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరోయిన్ కు కూడా ఓ చేదు అనుభవం ఎదురైందట.
సినిమాఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది నటి లైలా. ఈ ముద్దుగుమ్మ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది లైలా. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్ లోను సత్తా చాటింది ఈ అమ్మడు. ఆతర్వాత సినిమాలు తగ్గించిన లైలా.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తాజాగా లైలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పొట్టి స్కర్టులు, తక్కువ టాప్స్ వేసుకోమని అడిగే దర్శకులు చాలా మంది ఉన్నారని లైలా తెలిపింది.
ప్యాడ్స్ పెట్టుకోమని కూడా దర్శకులు చెప్పారని లైలా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ లైలా మాత్రం అందుకు ఒప్పులేదట. కుదరదు అని ఖరాకండిగా చెప్పిందట. ఒక దర్శకుడు నాకు షార్ట్ స్కర్ట్ ఇచ్చాడు. నువ్వు ధరించాలి, అది నీకు గ్లామర్‌గా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పటి వరకు హోమ్లీ క్యారెక్టర్లు చేశావు. ఇది కూడా ట్రై చెయ్యి అన్నాడు. నేను అంగీకరించాను. నేను పొట్టి స్కర్ట్ వేసుకున్నాను. అయితే నేను గ్లామర్‌గా కనిపించడం లేదని, బొమ్మలా కనిపిస్తానని చెప్పాడు. నువ్వు వేసుకోమని అడిగినందుకే పొట్టి స్కర్ట్ వేసుకున్నానని కూడా చెప్పాను అని తెలిపింది. కానీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. కొంతమంది గ్లామర్ పాత్రలు పోషిస్తున్నారు. అది వారి ఇష్టం. ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు ఉంటాయి. అని లైలా అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి