సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. కొంతమంది అవకాశాలు అందుకున్నా కూడా అదృష్టం కలిసి రాక సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. తాజాగా ఓ అందాల భామ స్టార్ హీరో సినిమా కారణంగా తన కెరీర్ నాశనం అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ అజిత్. అవును అజిత్ సినిమా చేయడం వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఇంతకూ ఆమె ఎవరు.? ఎందుకు ఆ చిన్నది అజిత్ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయ్యింది అనేది చూద్దాం.!
తమిళ్ ఇండస్ట్రీలో తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో మనోచిత్ర ఒకరు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది ఈ అమ్మడు. మనోచిత్ర మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. నాటు కోడి (2020), జై సేన (2021) సినిమాల్లో మెప్పించింది. కాగా ఈ అమ్మడు అజిత్ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని కామెంట్స్ చేసింది. అజిత్ చిత్రం వీరంలో నటిస్తున్నప్పుడు జరిగిన ఒక చేదు సంఘటన గురించి మాట్లాడింది ఆమె.
వీరం 2014 లో విడుదలైన చిత్రం, సిరుతై శివ దర్శకత్వం వహించారు. దీని పై మనోచిత్ర మాట్లాడుతూ.. అజిత్ సినిమా వీరం షూటింగ్ చాలా చోట్ల భారీ స్థాయిలో జరిగింది. ఆ సినిమాలో నేను బాగా నటించి పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటానని అనుకున్నాను. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నాకు చాలా ప్రశ్నలు తలెత్తాయి. దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు, తమన్నా సినిమా సగంలోనే చనిపోయింది. ఆ తర్వాత నువ్వు అజిత్ సరసన నటించాలి అని అన్నాడు. కానీ నేను షూటింగ్ వచ్చిన తర్వాతే అతను చెప్పింది పూర్తిగా అబద్ధమని నాకు అర్థమైంది.
ఆ తర్వాత ఆ షూటింగ్ స్పాట్‌లో ఉండటం నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను, కానీ అందరూ శాంతింపజేసి నన్ను అక్కడే ఉండనిచ్చారు. కొన్ని రోజుల తర్వాత, చిత్ర బృందం నాకు ఫోన్ చేసి, ఆ సినిమాలో కేవలం 2 రోజులు నటించమని అడిగారు. నేను ఆ సినిమాలో నటించడానికి ఏకైక కారణం అజిత్ సార్. నేను ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల్లో, నా తమిళ సినీ కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన సినిమా వీరం అని మనోచిత్ర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి