కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొన్నారు. బాలాసోర్ జిల్లాలో ఉన్న బాదమందరుని గ్రామంలో నిందితుడి అత్తమామలు ఉంటారు. వారి ఇంట్లో ఉన్న ఆవు పేడ కుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్టు గుర్తించారు. హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు జరిపిన సోదాల్లో శనివారం ఈ నగదు బయటపడింది. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు. డబ్బు కొట్టేసిన నిందితుడి పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. హైదరాబాద్ లోని వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..