వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఓ ఇంటి పెరట్లో ఉన్న సీతాఫలం చెట్టు వద్ద అదే పనిగా చప్పుళ్లు వినిపించాయి. ఆ ఇంటి మహిళ కవిత ఏంటా అని వెళ్లి చూడగా.. భారీ మొసలి కనిపించింది.
దీంతో భయపడిన ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ పరుగులు తీసింది. తన భర్తకు ఆ విషయం చెప్పింది. స్థానికులు కూడా వచ్చి భారీ మొసలిని చూశారు. వెంటనే స్నేక్ సొసైటీకి సమాచారమిచ్చారు. వారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో అక్కడికి చేరుకుని.. దాదాపు 11 అడుగుల పొడవు.. 230 కేజీల బరువున్న భారీ మొసలిని అతి కష్టం మీద బంధించారు.