పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. బంగారం ధరకన్నా.. ఆభరణాల తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
అయితే మధ్యతరగతి వారికి బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంది. మొన్నటి వరకు 22 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ. 75 వేల వరకు వెళ్లింది. సామాన్యులు బంగారం కొనడం కాదు పుత్తడిని చూడాలన్న భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్థాయిలో గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఉందా? యస్.. ఉంది. అదే ల్యాబ్ మేడ్ గోల్డ్. బంగారం కొనలేని వారికి ఇప్పుడు ల్యాబ్ మేడ్ గోల్డ్ అందుబాటులోకి వచ్చింది. బంగారాన్ని గోల్డ్ మైన్స్ నుంచి తీస్తారు. కానీ ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ ను ల్యాబ్ లో తయారు చేస్తారు. పశ్చిమ బెంగాల్ లో ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ ను తయారు చేసే ల్యాబ్ లు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. బంగారానికి ఏమాత్రం తీసుపోని విధంగా ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ ఉండటంతో మధ్యతరగతి వారి దృష్టిని ఇది ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఎక్కువగా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రూర మృగాలతో మైక్ టైసన్ చెలగాటం
గాలిని అమ్మడం ఏందిరా బాబు !! రూ.1,000కి టిన్ను గాలా ??
ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల క్యాష్
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
Published on: Nov 22, 2024 08:29 PM