జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది. ఇది అధిక తేమను కలిగి ఉంటుంది. పొడి, పెళుసైన జుట్టును నివారిస్తుంది. తమలపాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన జుట్టును పొందడంలో సహాయపడుతుంది. తమలపాకు.. స్కాల్ఫ్‌ను ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇవి చుండ్రును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. తమలపాకు జుట్టును స్ట్రెయిట్ చేస్తుంది. జుట్టును మందంగా, పొడవుగా చేస్తుంది. తమలపాకులలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టుకు తమలపాకు చికిత్సకు ఎక్కువ శ్రమ అవసరం లేదు. తమలపాకులను బాగా కడిగి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో ఒక టేబుల్‌స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి, మీ జుట్టుకు అప్లై చేసి, గంట తర్వాత షాంపూతో గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకసారి పాటిస్తే తెల్లజుట్టు నల్లగా అందంగా, మెరిసిపోతుంది. అలాగే 4 లేదా 5 తమలపాకులు , 2 టేబుల్ స్పూన ల కొబ్బరి నూనె , 1 టీస్పూన్ కాస్టర్ ఆయిల్ తీసుకోవాలి. తమలపాకులను గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక గిన్నెలో పేస్ట్, కొబ్బరి నూనె, కాస్టర్ ఆయిల్, కొన్ని చుక్కల నీరు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత, 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి మండపం లోకి పాము వచ్చింది.. ఆ తర్వాత ఏమైంది ??
అంబులెన్స్‌లో భారీ పేలుడు.. లోపల నిండు గర్భిణీ..
తులసీ గబ్బార్డ్ నియామకం.. పాకిస్థాన్‌ను భయపెడుతుంటే.. భారత్‌ను సంతోషపెడుతోందా ??
Obesity: ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే.. మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది