ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తమ స్నేహితులు, బంధువులు, సన్నిహితులను పిలిచి వారి మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. తాజాగా ఓ యువతి కేక్ కట్ చేస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. కేక్‌లో రూ.500 నోట్లు కనిపించాయి. నోట్లు ఒకదానికొకటి దండలాగా తగిలించి ఉన్నాయి. యువతి ఎంత లాగినా ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో యువతి సంబ్రమాశ్చర్యాలకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై స్పందించారు. మాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలంటూ కొందరు కామెంట్ చేశారు. ఇది కేకా లేక ఏటీఎంమా అంటూ పలువురు ఫన్నీగా కామెంట్ రాశారు. నాకు ఈ కేక్ కావాలని మరొకరు రాశారు. దీపావళి బోనస్ ఇచ్చారు అని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
ఇక్కడ క్లిక్ చేయండి..
ఇదిలా ఉంటే, దీపావళి సందర్భంగా కొందరు బంగారం పొగొట్టుకుని తిరిగి దక్కించుకోగా, మరొకరు ఇంటిని శుభ్రం చేస్తుండగా, పాత నోట్ల కట్ట లభించింది. ఎందుకు పనికి రాని ఆ నోట్లను ఏం చేసుకోవాలో అర్థం కాక.. ఆ యువతి విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఇలా ఈ దీపావళి సందర్భంగా పలు ప్రాంతాల్లో చిత్ర విచిత్రమైన సంఘటలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.