సినిమా ఇండస్ట్రీలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. కొంతమంది స్టార్స్ గా ఎదుగుతుంటే.. మరికొంతమంది అవకాశాలు రాకా రోడ్ల పై తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఒకప్పుడు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు పూట కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే పై ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.? ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.? ఏం చేస్తున్నాడు.? ఎందుకు సినిమాలు చేయడం లేదు అని కొందరు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
తాజాగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు యంగ్ లుక్ లోకి మారిపోయాడు. విక్రమార్కుడు, ఖడ్గం, మున్నా, ఆంధ్రావాలా, ఛత్రపతి, మాస్ ఇలా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. హీరో లుక్ ఉన్న కూడా సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోతున్నాడు అతను. అతని పేరు రవి. తాజాగా అతను హైదరాబాద్ రోడ్ పై కనిపించగా ఓ వ్యక్తి అతన్ని ఇంటర్వ్యూ చేశాడు.
ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
నీకు పేరుంది. అన్ని సినిమాల్లో నటించవు. ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే అవకాశం ఇస్తారు కదా.? అని అడగ్గా అతను ఇలా సమాధానం ఇచ్చాడు. నాకు అడగటం ఇష్టం లేదు. ఆఫీసుల చుట్టూ తిరగడం నా వల్ల కాదు అని సమాధానం ఇచ్చాడు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈవీడియోకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అతను హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ఉంటాడు అని. అతని ఫ్యామిలీ సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని, అతని అమ్మ జూనియర్ ఆర్టిస్ట్ కావడంతో అతనికి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయని, ఓ యాక్సిడెంట్ లో ఫ్యామిలీ అంతా చనిపోవడంతో ఇప్పుడు ఇలా అయిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి