ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌లో క్రాకర్స్ వేస్తున్నాడు. బాణసంచాకు నిప్పు అంటించి పెట్రోల్ ట్యాంకులో వేశాడు. తను మాత్రం దూరంగా వెల్లి నిలబడ్డాడు. కొంతసేపటికి పటాకులు పేలడంతో బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్, సీటు ఎగిరిపోయాయి. ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Diwali Firecracker In Bike Petrol Tank
నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో యువత ప్రతి పనిని భిన్నంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఫేమస్ అవ్వాలనే ఆరాటం, సోషల్ మీడియా రీల్స్ లైకులు, వ్యూస్ కోసం ఎలాంటి వికృతమైన పని చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు. ఇలాంటి ప్రయత్నాలు చాలా సందర్భాల్లో వారిని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా అలాంటి పని చేసిన ఓ యువకుడి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రతి ఒక్కరూ అతనిపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ అతడు చేసిన పని ఏంటంటే..
దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌లో క్రాకర్స్ వేస్తున్నాడు. బాణసంచాకు నిప్పు అంటించి పెట్రోల్ ట్యాంకులో వేశాడు. తను మాత్రం దూరంగా వెల్లి నిలబడ్డాడు. కొంతసేపటికి పటాకులు పేలడంతో బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్, సీటు ఎగిరిపోయాయి. ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో @y_iamcrazyy అనే ఖాతా ద్వారా X ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయబడింది. కాగా, ఈ వీడియోను 5.15 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన ప్రజలు వివిధ రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ అబ్బాయికి పిచ్చి బాగా ముదిరిందని ఒకరు రాయగా, బైక్ ట్యాంక్‌ని ఓపెన్ చేయడానికి మంచి మార్గం దొరికింది అని ఇంకొకరు రాశారు. మరొకరు ‘హహ.. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో కదా..! అంటూ మరొకరు రాశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.