ఉపరితల ద్రోణిగా సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని మెట్ అథారిటీ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వానలు పడవచ్చు. తెలంగాణాలో నవంబర్ 22 వరకు పొడి వాతావరణం ఉంటుందన ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లలో ఆదివారం నుంచి నవంబర్ 20 వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లిలో నవంబర్ 19, 20 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నవంబర్ 20 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండొచ్చని తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, సూర్యాపేట, కుమురం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డిలో శనివారం నాడు తేలికపాటి వర్షం కురిసింది. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. శనివారం నాడు పలు జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్
బిగ్ అలెర్ట్.. మీ పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ అయి ఉందా ??
ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??
చాలా ఏళ్లకు కనిపించి.. సడ్‌సర్‌ప్రైజ్ చేసిన తమ్ముడు హీరోయిన్