ఉపాయం లేనివాళ్లను ఊళ్లోంచి తరిమేయాలని నానుడి. అందుకే ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని పెంచుకోడానికి వినూత్నంగా ఆలోచించాడు. సాధారణంగా స్టార్ హీరోలకు అభిమానులు ఎక్కువే ఉంటారు. తమ అభిమాన హీరో ఊళ్లోకి వస్తున్నాడని తెలిస్తే ఇక ఆగుతారా? ఎక్కడివక్కడ వదిలేసి లగెత్తరూ.. అదే జరిగింది. పాతబస్తీలోని ఓ మండీ వ్యాపారి తన హోటల్‌కు సల్మాన్‌ఖాన్ వస్తున్నాడని ప్రచారం చేశాడు.
అంతే భారీ సంఖ్యలో జనాలు హోటల్‌కు క్యూ కట్టారు. సల్మాన్ ఖాన్ మండీలో తినడానికి వస్తున్నాడని ఓ వార్త పాతబస్తీలో అలా అలా వ్యాపించింది. పాత బస్తీలో ఉన్న హోటళ్లలో కాంపిటీషన్ పెరిగి బిజినెస్ తగ్గిపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించిన వ్యాపారి ఓ ఫేక్ ప్రచారం చేయించాడు. కొందరు వ్యక్తుల ద్వారా సల్మాన్ వస్తున్నాడని వదంతులు సృష్టించి ఫ్రీ పబ్లిసిటీ చేయించుకుంది హోటల్ యాజమాన్యం. దీంతో వెర్రెక్కిన జనం వందలాదిగా తరలివచ్చి హోటళ్ల ముందు క్యూ కట్టారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వస్తాడా అని ఎదురుచూశారు. హోటల్‌కి వచ్చి ఊరికే ఉంటే బాగోదని ఇష్టం లేకపోయినా ఆర్డర్ చేసుకుని మండి తిన్నారు. ఇలా మొత్తానికి వ్యాపారం బాగానే సాగింది. ఎప్పటికీ సల్మాన్‌ఖాన్ రాకపోయేసరికి ఎవరికో అనుమానం వచ్చి, హోటల్ వాళ్లను అడిగారు. అందుకు వారు.. అసలు సల్మాన్ వస్తున్నాడని ఎవరు చెప్పారు? అలాంటిదేమీ లేదని చెప్పడంతో అందరూ తలలు బాదుకున్నారు. దీంతో చేసేదేం లేక కస్టమర్లు తీవ్ర నిరాశతో తిన్నదానికి బిల్లు కట్టి చేయి కడుక్కుని తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు.. రాత్రంతా అమ్ముకుని వ్యాపారం చేసుకోవాల్సిందంతా గంటలోపే ఆ బిజినెస్ అయిపోవడంతో హోటల్ నిర్వాహకులు కూడా షాపులు మూసేసి వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది ??
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
Published on: Nov 16, 2024 09:53 PM