కడప జిల్లాలో వెలుగు చూసిన మహిళ హత్య కేసులో పోలీసలు పురోగతి సాధించారు. నమ్మిన వ్యక్తే అత్యంత పాశవికంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాశినాయన మండలం కొత్తపేట హరిజనవాడకు చెందిన కొత్తపల్లె భాస్కర్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భర్త స్నేహితుడు భాస్కర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
గత నెల రోజుల క్రితం బద్వేలు సమీపంలోని గోపవరం అటవీ ప్రాంతంలో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరువక ముందే మరొక దారుణం కాశీనాయన మండలంలో వెలుగు చూసింది. మహిళను అత్యంత దారుణ హత్య చేశారు దుండగులు. ఒంటిపై వస్త్రాలు లేకుండా చేసి, ముఖం గుర్తు పట్టకుండా బండరాయి మోది నుజ్జు నుజ్జు చేశారు. ఈ దారుణ ఘటన కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లె గ్రామాల మధ్యలో జరిగింది. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతుంది.
ఉదయం పశువుల కాపర్లు పశువులను అటువైపుగా తీసుకువెళ్లగా వారికి మృతురాలు కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ మహిళ అక్కడకు ఒక వ్యక్తి ద్వారా వచ్చినట్లు పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విచారణ చేపట్టారు.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం లోని కాశినాయన మండలం పాపిరెడ్డి పల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో దారుణ హత్యకు గురైంది. ఆమెను వివస్త్రను చేసి మొహంపై రాయితో కొట్టి చంపినట్లుగా కనబడుతుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు హత్యకు గురైన మహిళది ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం ఖాదరపల్లికి చెందిన కరిమున్నీసాగా, ఆమె చేతి పై ఉన్న టాటూ ఆధారంగా గుర్తించినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా సంఘటన స్థలానికి క్లూస్ టీం పిలిపించి వివరాలు సేకరించారు.
అయితే మహిళ ఒక వ్యక్తి ద్వారా అక్కడకు వచ్చినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇదే విషయంపై జిల్లా ఇంచార్జ్ ఎస్పి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసును ఛేదించామని, కరీమున్నిసా భర్త నాసిల్ స్నేహితుడు భాస్కర్ ద్వారా ఆ మహిళ ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్న భాస్కర్ దొరికితే పూర్తి వివరాలు సేకరించి దోషులను త్వరలోనే పట్టుకుంటామని ఇంచార్జ్ ఎస్పీ తెలిపారు. భాస్కర్‌తో నాసిల్‌కు జైలులో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నాసిల్ ఇంటికి భాస్కర్ వచ్చేవాడని విచారణలో తేలిందని ఇంచార్జ్ ఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న భాస్కర్ కోసం పోలీసుల ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా లేదా హత్య మాత్రమే చేశారా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా హత్య అక్కడే జరిగిందా లేదా వేరే చోట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం మీద మహిళను అతి దారుణంగా అతి కిరాతకంగా చంపిన ఆనవాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..