మరి దీనికి పరిష్కారం..? ఏలూరు జిల్లాలో దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో గుంపులు గుంపులుగా కోతులు తిరుగుతున్నాయి. అడవిలో పండ్లనిచ్చే చెట్లన్నింటినీ నరికివేయడంతో ఆకలితో అలమటిస్తూ రహదారుల మీదికి వస్తున్నాయి. వచ్చిపోయే వాహనాల నుంచి మనుషులు ఏమైనా వేయకపోతారా అని ఎదురు చూస్తూ ఆ వాహనాలకు ఎదురెళుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన అడవుల్లో వన సంపద కనుమరుగవుతోంది. మనుషులు తమ స్వార్థానికి అడవిని నరుక్కుంటు పోతుండటంతో ఆవాసం లేక మూగజీవాల చెల్లాచెదురవుతున్నాయి. దీంతో అటు మేత లేక, ఇటు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకక అడవి జంతువులు తప్పనిసరి పరిస్థితుల్లో జనారణ్యంలోకి అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలబారిన పడి ప్రాణాలు వదులుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆహారం, నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేసి వాటి ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
వాట్సాప్‌లో సీక్రెట్ చాటింగ్.. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది ??