గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన చేపడుతోన్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అపోలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె.. మహిళలు, పేదల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం తోడ్పడుతోంది. ఈ క్రమంలోనే తన చిన్న మామ డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో.. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది.
ఎస్ ! అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉపాసన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించింది. తన మామ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఉపాసన. ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పించం.. తమ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం అంటూ ఉపాసన పేర్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ