ఉన్నదొక్క సంక్రాంతి.. ఉండే సెలవులు వారం రోజులు.. పోటీలో ఉన్న సినిమాలేమో 5.. పైగా అన్నీ క్రేజీ సినిమాలే.. ఆ వారం రోజుల కోసమే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి.. అసలు సంక్రాంతి 2025కి అంత కెపాసిటీ ఉందా..? ఒకేసారి 5.. అందులో 2 పాన్ ఇండియన్ సినిమాలు వచ్చినా.. తట్టుకుని బిజినెస్ చేసేంత సత్తా పొంగల్‌కు ఉందా..? అసలు సంక్రాంతి సినిమాలేంటి.. వాటి లెక్కలేంటి..? సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌కు కొత్త ఊపిరి. రెండు మూడేళ్ళుగా పండక్కి వచ్చిన సినిమాలు రప్ఫాడించాయి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. మొన్నటి సంక్రాంతి హనుమాన్, గుంటూరు కారం వందల కోట్లు వసూలు చేసాయి. ఈ సారి కూడా ఇదే జరగబోతుంది. 2025 సంక్రాంతి సందడి 2 నెలల ముందుగానే మొదలైపోయింది. పండగ పందెంకోళ్లు సిద్ధమవుతున్నాయి.
ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..
సంక్రాంతి పండక్కి బిజినెస్ భారీగానే జరుగుతుంది. ఒక్కోసారి 1000 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుంది. అంత పొటెన్షియాలిటీ ఉన్న పండగ సంక్రాంతి. అందుకే ఎన్ని సినిమాల్నైనా బరిలోకి దించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు.. హీరోలు కూడా అదే పోటీ వాతావరణంతో బాక్సాఫీస్ దగ్గర పోరుకు పందెంకోళ్లలా సై అంటుంటారు. ఈ సారి కూడా వెంకటేష్, రామ్ చరణ్, బాలయ్య సమరానికి సై అంటున్నారు. సంక్రాంతికి రావాలని ప్రతీ హీరో మనసులో ఉంటుంది. కాకపోతే పరిస్థితులన్నీ అనుకూలించాలి. అది వర్కవుట్ అవ్వకే విశ్వంభర వాయిదా పడింది. మొన్నటి వరకు జనవరి 10న విడుదల అనుకున్నా కూడా.. తనయుడి కోసం తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు చిరంజీవి. దాంతో గేమ్ ఛేంజర్ అంటూ వస్తున్నారు రామ్ చరణ్. గతంలో ఎవడు, నాయక్, వినయ విధేయ రామతో సంక్రాంతికే వచ్చారు చరణ్. 2019 తర్వాత ఆరేళ్ళు గ్యాప్ తీసుకుని సంక్రాంతి బరిలో దిగుతున్నారు రామ్ చరణ్. నిజానికి డిసెంబర్‌లోనే గేమ్ ఛేంజర్ విడుదలవుతుందని చెప్పినా.. సంక్రాంతి అయితే బాగుంటుందని డేట్ మార్చేసారు మేకర్స్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పండక్కి జరిగే బిజినెస్‌లో అగ్ర తాంబూలం గేమ్ ఛేంజర్‌దే. రాజమౌళి తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుందని ఇన్నాళ్ళూ ఓ శాపం ఉండేది. దాన్ని దేవరతో తుడిచేసారు జూనియర్ ఎన్టీఆర్. దేవర బ్లాక్‌బస్టర్ కావడంతో.. రాజమౌళి కర్స్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు రామ్ చరణ్ వంతు. RRR తర్వాత ఆచార్యలో నటించినా.. అందులో చరణ్ చేసింది సపోర్టింగ్ రోల్. కాబట్టి గేమ్ ఛేంజర్‌తో దేవర చేసిన మ్యాజికే చేయాలని చూస్తున్నారు చరణ్.
ఇవి కూడా చదవండి
2025 సంక్రాంతికి మెగా, నందమూరి ఫైట్ మరోసారి రిపీట్ కాబోతుంది. నిజానికి బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడాల్సి ఉంది.. కానీ చివరి నిమిషంలో తను తప్పుకుని తనయుడిని బరిలో నిలబెట్టాడు మెగాస్టార్. దాంతో బాలయ్య, చరణ్ సినిమాలు ఈసారి పోటీ పడబోతున్నాయి. ఓ వైపు గేమ్ ఛేంజర్.. మరోవైపు NBK 109 పండక్కే వస్తున్నాయి. జనవరి 10న చరణ్ వస్తుంటే.. 12న డాకూ మహారాజ్ అంటూ బాలయ్య వచ్చేస్తున్నాడు. వరస విజయాలతో జోరు మీదున్న బాలయ్య సినిమాకు బిజినెస్ సమస్యలేం లేవు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బిజినెస్ 100 కోట్లు దాటేసింది. కచ్చితంగా పండక్కి మరోసారి దుమ్ము రేపుతాను అంటున్నారు బాలయ్య.
ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
ఈయనకు పోటీగా మరో సీనియర్ హీరో వెంకటేష్ వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనేది ఈయన టైటిల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రామ్ చరణ్, వెంకటేష్ సినిమాలను నిర్మిస్తుంది ఒకే నిర్మాత.. అదే దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరుగుతున్న తరుణంలో.. ఒకేసారి ఈ రెండు సినిమాలను విడుదల చేయాలనుకోవడం నిజంగా సాహసమే అవుతుంది. దిల్ రాజు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు.. థియేటర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది అతిపెద్ద ప్రశ్న. సంక్రాంతికి ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలున్నాయి. ఇంకొకరు రావడానికి అక్కడ స్కోప్ కూడా లేదు.. వచ్చినా థియేటర్స్ దొరుకుతాయో లేదో గ్యారెంటీ లేదు. అయినా సరే.. రేసులో నేనున్నానంటూ వచ్చేస్తున్నారు సందీప్ కిషన్. ఈయన నటిస్తున్న మజాకా అటూ ఇటూ తిరిగి చివరికి సంక్రాంతికే ఫిక్స్ అయింది.
రామ్ చరణ్‌కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం.. ఆయన సినిమా వచ్చిందంటే ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 1200 స్క్రీన్స్ అయితే ఇవ్వాల్సిందే. ఇప్పటికే జనవరి 10న గేమ్ ఛేంజర్ అంటూ డేట్ లాక్ చేసారు నిర్మాతలు. జనవరి 10న గేమ్ ఛేంజర్ వస్తే.. దాన్ని బేస్ చేసుకుని ముందు వెనక తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. జనవరి 12న బాలయ్య.. 14న వెంకీ వచ్చేస్తున్నారు. ఇక వస్తే.. సందీప్ కిషన్ మజాకా అన్నింటికంటే చివరగా విడుదల కానుంది. సంక్రాంతి సినిమాలన్నింటినీ బడా నిర్మాతలే బ్యాకప్ చేస్తున్నారు. ఈ లెక్కన ఎవరికీ థియేటర్స్ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు వచ్చినపుడు కచ్చితంగా అనుకున్న దానికంటే తక్కువ స్క్రీన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానివల్ల వసూళ్లు కూడా దారుణంగా తగ్గిపోతుంటాయి. 2025 సంక్రాంతికి ఏ సినిమా ఎలా ఉన్నా.. కలెక్షన్లపై ఈ ప్రభావం అయితే పడటం ఖాయం.
ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.