టర్కీ రాజధాని అంకారాలో ’26/11′ తరహాలో ఉగ్రదాడి! 10 మంది మృతి.. పెరుగుతున్న క్షతగాత్రులు

2 hours ago 1

టర్కీ రాజధాని అంకారాలోని ఏవియేషన్ కంపెనీ టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) ప్రధాన కార్యాలయం వెలుపల తీవ్రవాద దాడి జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. చాలా మందిని బందీలుగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 10 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడిని ఆత్మాహుతి బాంబు పేలుడుగా స్థానిక అధికారులు భావిస్తున్నారు. టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ దీనిని ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక ప్రకటన విడుదల చేశారు. “టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. దురదృష్టవశాత్తు, టర్కీ సైనికులు అమరులయ్యారు. చాలా మంది గాయపడ్డారు.” అంటూ అలీ యెర్లికాయ పేర్కొన్నారు.

Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.

Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.

Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.

Gelişmelerden kamuoyu…

— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024

ఈ దాడి జరిగిన సమయంలో ఆవరణలో ఉన్న ఉద్యోగులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, టర్కీ అధికారులు దీనిని తీవ్రవాద దాడిగా స్పష్టంగా అభివర్ణించినప్పటికీ, ఈ దాడికి ఇంకా ఏ సంస్థ బాధ్యత వహించలేదు.

TUSAS (టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్) ఒక టర్కిష్ రక్షణ, విమానయాన సంస్థ. హైటెక్‌తో పాటు, ఇది దేశంలోని ఏరోస్పేస్, రక్షణ రంగానికి ప్రధాన సహకారం అందిస్తోంది. ఈ కంపెనీ టర్కీ మొట్టమొదటి జాతీయ యుద్ధ విమానం KAAN ను ఉత్పత్తి చేసింది. TUSAS Türkiye సైనిక అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విమానయానం, రక్షణ ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తోంది. దీని నైపుణ్యం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, UAVలు (డ్రోన్లు), ఉపగ్రహాలను సైతం తయారీ చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article