చాలా సార్లు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కనుక టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే టాయిలెట్ లో చేసే తప్పులు రోగాలను కలిగిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో టాయిలెట్కు వెళ్ళడం ముఖ్యమైన చర్య. కనుక టాయిలెట్‌కు వెళ్లడానికి ముందు లేదా తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరుగుదొడ్డికి వెళ్లే సమయంలో చేసే కొన్ని తప్పులు ఏమిటి.. వాటిని ఎలా నివారించుకొవచ్చో తెలుసుకుందాం. తద్వారా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు.
టాయిలెట్ సీటు శుభ్రపరచడం
వీలైనంత వరకు ఇండియన్ టాయిలెట్స్ వాడటానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ వెస్ట్రన్ టాయిలెట్ వాడాల్సి వస్తే.. జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా టాయిలెట్ సీటును శుభ్రం చేయకుండా ప్రజలు కూర్చుంటారు. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ టాయిలెట్లను చాలా మంది వ్యక్తులు ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి హాని కలిగించే వైరస్‌లు ఉంటాయి కనుక టాయిలెట్‌కు వెళ్లే ముందు టాయిలెట్ స్ప్రేని ఉపయోగించాలి. అంతేకాదు టాయిలెట్ సీటును తరచుగా శుభ్రంగా ఉంచండి లేదా ఈ టాయిలెట్లలో బాక్టీరియా, వైరస్లు వ్యాప్తి చెందుతాయి. పబ్లిక్ టాయిలెట్‌ని ఉపయోగించే ముందు.. తర్వాత మీ చేతులను శుభ్రం చేసుకోండి.
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవద్దు
ఈ రోజుల్లో చాలా మంది టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు కూడా ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే టాయిలెట్ సీట్‌లో బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. కనుక మీరు టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే.. ఫోన్ పై కూడా బ్యాక్టీరియా చేరుకుంటుంది. తర్వాత ఈ ఫోన్ ను ముఖానికి లేదా ఇతర భాగాలకు తాకినప్పుడు ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుకొని ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కనుక స్మార్ట్‌ఫోన్‌ను టాయిలెట్‌లో ఉపయోగించకూడదు.
ఇవి కూడా చదవండి
అధిక టాయిలెట్ పేపర్ వాడకం
టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా వ్యాధులకు కారణమవుతాయి, చాలా మంది టాయిలెట్ పేపర్‌ను ఎక్కువగా వాడతారు. అయితే ఈ టాయిలెట్ పేపర్‌ను ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు, దద్దుర్లు ఏర్పడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)