పెద్దన్న పాత్ర అమెరికాది అయితే.. మిగిలిన దేశాలన్నీ.. కుటుంబంలో మిగతా సభ్యులన్నమాట. అమెరికా తీసుకునే డెసిషన్స్…అంతర్జాతీయంగా తప్పకుండా ఎంతో కొంత ప్రభావాన్ని చూపించి తీరతాయి. అది ఆ దేశ కరెన్సీ డాలర్‌కి ఉన్న బలం. అందుకే..అక్కడ అధికారంలో ఎవరున్నారు..? అక్కడ రాజకీయాలు ఎలా మారుతున్నాయి..? ఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని… ప్రపంచ దేశాలన్నీ చాలా ఆసక్తిగా గమనిస్తుంటాయి. అందులో భారత్ కూడా ఒకటి. ముఖ్యంగా అమెరికాకి మిత్ర దేశంగా ఉన్న భారత్..ఇంకాస్త ఎక్కువగా అక్కడి పరిణామాలపై ఫోకస్ పెడుతుంది. మొన్నటి వరకూ జో బైడెన్ ఉన్నా..అంతకు ముందు ట్రంప్ ఉన్నా..అమెరికాతో ఆ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఇండియా. ఇప్పుడు మరోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో..స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఫోకస్ పెరిగింది. ఆయన పాలసీలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
ట్రంప్ వచ్చేశాడు. నెక్ట్స్ ఏంటి..? ఇప్పుడంతా ఇదే డిస్కషన్. ఎందుకంటే..ట్రంప్ తీసుకునే డెసిషన్స్ అలా ఉంటాయి. ఆయన ఏం చేసినా సెన్సేషనే. అమెరికా ఫస్ట్ నినాదంతో మొదటిసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్…ఆ స్లోగన్‌ని వదిలిపెట్టడం లేదు. మధ్యలో జో బైడెన్ అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో అమెరికా ప్రాభవం అంతా కోల్పోయిందని ట్రంప్ గట్టిగానే ప్రచారం చేశారు. అందుకే..ఈ సారి “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అనే స్లోగన్‌తో అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ ఒక్కటే. ట్రంప్ పాలసీలు ఎలా ఉంటాయ్..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? అసలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే స్టాక్‌మార్కెట్‌లో ఓ టెన్షన్ మొదలైంది. దలాల్ స్ట్రీట్ డల్ అయిపోయింది. ఇప్పటికే జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా…ఓ రకమైన అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. ఇలాంటి టైమ్‌లో ఈ అన్ సర్టైనిటీని గాడిన పెట్టే విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటారా..అన్నదే ఓ పెద్ద సస్పెన్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ప్రతికూల వాతావరణంతో ఇప్పటికే స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడింది. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కొంత గందరగోళంగానే ఉంది. ట్రంప్ వచ్చి ఇదంతా సెట్ చేసేస్తారన్న ఓ నమ్మకంతో పాటు ఎక్కడో ఓ మూల చిన్న భయం కూడా కనిపిస్తోంది.
మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం చూస్తే..ట్రంప్ ప్రభుత్వం అమెరికాకి ప్రియార్టీ ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టారిఫ్‌లు, ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో ట్రంప్ నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న అంచనాలూ ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల..చైనా, జపాన్, సౌత్ కొరియా, వియత్నాంపై నెగటివ్ ఇంపాక్ట్ పడొచ్చు. ఇదే సమయంలో భారత్ సహా ఇండోనేషియా, మలేషియాకి ఇది ప్లస్ అవుతుండొచ్చు. డిఫెన్స్ టెక్ కంపెనీలకు ట్రంప్ మంచి బూస్ట్ ఇచ్చే అవకాశముందని..ఎటొచ్చీ…ఎక్స్‌పోర్ట్ కంపెనీలపైనే టారిఫ్ భారం పడి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఇదంతా పక్కన పడితే…ఇండియాలోని ఓ సామాన్యుడికి..ట్రంప్ అధికారంలోకి రావడానికి ఓ లింక్ ఉంది. ఈ రోజుల్లో అందరికీ సొంత వాహనాలున్నాయి. వెహికిల్ ఉందంటే..కచ్చితంగా ఫ్యుయెల్ అవసరం. ఈ పెట్రోల్, డీజిల్ ధరలపైనా ట్రంప్ ప్రభావం ఉండనుంది. ఇప్పటికే రష్యా,ఇరాన్ ఆయిల్‌పై ఆంక్షలు పెట్టేందుకు అంతా సిద్ధం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉన్నారు. ఇతర వివరాల కోసం ఫుల్ వీడియోను చూడండి..